ప్ర‌జావేదిక కూల్చివేత ఆరంభం

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:56 AM
 

 ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం ప్రకటించిన 24 గంటల్లో కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఆర్డీయే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రజావేదికలోని ఫర్నీచర్‌, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి చేరవేస్తున్నారు. కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.