బాబూ! మీ నివాసం మీదా? లింగమనేనిదా?

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:26 AM
 

ఆక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేస్తామంటే తెలుగుదేశం వంది మాగదులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని ఎద్ధేవా చేశారు.రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మంగళవారం ప్రజావేదిక వద్దకు వచ్చిన మంత్రి పేర్ని నాని కరకట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో ప్రజావేదికను నిర్మాణం చేయడమే కాకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాన్ని తొలగిస్తామని మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు కన్నీరు, మున్నీరు అవుతున్నారని ప్రశ్నించారు. 4 కోట్లు ఖర్చు అయ్యే ప్రజావేదిక అంచనాలను 8.9 కోట్ల రూపాయలకు పెంచుకుని దానిని హాల్వ తిన్నట్లు తీనేసారన్నారు.   


సిఆర్‌డిఎ అనుమతి లేకుండా, రివర్‌ కన్సర్వేషన్‌ బోర్డు  అనుమ‌తీ లేకుండా అధికారం ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజావేదికను నిర్మించారని, చంద్రబాబు నివాసానికి కూడా ప్రభుత్వం అద్దె చెల్లించిందని అద్దె భవనాన్ని తొలగిస్తామంటే ఎదో అఘాయిత్యం జరిగినట్లు అల్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబునాయుడు నివాసం లింగమనేనిదా? చంద్రబాబునాయుడుదా ? రాజధానిలో పొందిన ప్రతిఫలంతో గిఫ్ట్‌గా ఏమైనా ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అక్ర‌మ‌ని తేలితే  ఈ భ‌వ‌నం కూడా కూల్చేటందుకు వెన‌క్కి త‌గ్గ‌బోమ‌న్నారు మంత్రి.  ప్రతిపక్ష నాయకునికి ప్రభుత్వ భవనం  అవసరం అయితే ప్రభుత్వం పరిశీలించి కేటాయిస్తుందన్నారు.