మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. జెడ్ కేటగిరీ ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్మెన్లను కేటాయించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. కనీస సమాచారం ఇవ్వకుండా.. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రత తగ్గించడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.