అయోధ్య ఉగ్రదాడి కేసులో సంచల‌న‌ తీర్పు!

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 08:20 PM
 

అయోధ్య ఉగ్రదాడి కేసులో 14 ఏళ్ల  సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సంచన తీర్పు వెలువరించింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు వేసి, ఒక నిందితుణ్ని నిర్దోషిగా వదిలేసింది. ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక కోర్టు జడ్జి దినేశ చంద్ర ఈమేరకు తీర్పు వెలువరించారు. 2005 జూలై 5న అయోధ్యలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పౌరులను చంపేశారు. తాత్కాలిక రామమందిరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. భక్తుల రూపంలో వచ్చి జీపులో బాంబులు పెట్టి పేల్చేయడమే కాకుండా, తాత్కాలిక గుడిలోకి రాకెట్ లాంచర్ ప్రయోగించారు.
పోలీసులు ఎదురు కాల్పులు ఐదుగురు  ఉగ్రవాదులు మట్టుబెట్టారు. ఈ కేసులో ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్, మహ్మద్ అజీజ్ తదితరులను అరెస్ట్ చేశారు. దోషులపై కొందరు దాడి చేసే అవకాశముండడంతో వారిని కోర్టుకు తీసుకురాలేదు.  ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్‌లు ఉద్దేశపూర్వకంగా దాడికి సహకరించారంటూ కోర్టు వారికి జీవిత ఖైదు వేసింది. 14 ఏళ్ల  సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సంచన తీర్పు వెలువరించింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు వేసి, ఒక నిందితుణ్ని నిర్దోషిగా వదిలేసింది. ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక కోర్టు జడ్జి దినేశ చంద్ర ఈమేరకు తీర్పు వెలువరించారు. 2005 జూలై 5న అయోధ్యలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పౌరులను చంపేశారు. తాత్కాలిక రామమందిరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. భక్తుల రూపంలో వచ్చి జీపులో బాంబులు పెట్టి పేల్చేయడమే కాకుండా, తాత్కాలిక గుడిలోకి రాకెట్ లాంచర్ ప్రయోగించారు.
పోలీసులు ఎదురు కాల్పులు ఐదుగురు  ఉగ్రవాదులు మట్టుబెట్టారు. ఈ కేసులో ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్, మహ్మద్ అజీజ్ తదితరులను అరెస్ట్ చేశారు. దోషులపై కొందరు దాడి చేసే అవకాశముండడంతో వారిని కోర్టుకు తీసుకురాలేదు.  ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్‌లు ఉద్దేశపూర్వకంగా దాడికి సహకరించారంటూ కోర్టు వారికి జీవిత ఖైదు వేసింది.