నియోజక వర్గానికి ఒక్కో బోరు!సిఎం జ‌గ‌న్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 07:47 PM
 

రాష్ట్రంలో నియోజక వర్గానికి ఒకటి చొప్పున బోర్లు వేయటానికి 200 బోర్లు కొనుగోలుచేయని ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో రైతు రాజ్యం ఏర్పడే దిశగా, నవరత్నాలలో చెప్పిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన  తెలిపారు. 
రైతులు అప్పులు చేసి బోర్లు వేసినా , ఆ బోర్లలో నీరురాక రైతులు ఆత్మ హత్యలు నివారించటానికి  ప్రభుత్వం తరుఫున నియోజకవర్గానికో బోరు వేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారం లో చెప్పినదాని కంటే ముందుగానే 2019 అక్టోబరు 15 నుంచి  రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  రైతులు తీసుకున్న పాత అప్పులతో సంబంధం లేకుండా, పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా ఒకేసారి రూ.12,500 ఇవ్వబోతున్నామని ఆయన చెప్పారు.