హైదరాబాద్: ఓ ఇంద్రజాలకుడు నదిలో కొట్టుకుపోయాడు. గంగా నదిలో లైవ్ స్టంట్తో ఆకట్టుకోవాలనుకు అతను కనిపించకుండాపోయాడు. కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ వద్ద ఫేమస్ మెజీషియన్ చంచల్ లాహిరి.. ఆదివారం ఓ అండర్వాటర్ స్టంట్ చేశాడు. మిలినీయం పార్క్ వద్ద అతను ఆ మ్యాజిక్ చేయాలనుకున్నాడు. అయితే హౌరా బ్రిడ్జ్ లోని 28వ పిల్లర్ వద్ద అతను గల్లంతయ్యాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూపుతో పాటు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. చేతులుకు బేడీలు వేసి ఓ బోనులో అతన్ని కట్టేస్తారు. అయితే నీటిలోకి ఆ బోనును జార విడిచిన తర్వాత.. దాని నుంచి అతను మళ్లీ పైకి రావాలి. ఇలాంటి స్టంట్ చేయబోని చంచల్ లాహిరి.. నీటిలో మునిగిన తర్వాత మళ్లీ కనిపించలేదు. పది నిమిషాలైనా బయటకు రాకపోవడంతో..ఆ మ్యాజిక్ చూస్తున్న ప్రేక్షకులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. నలుగురు స్పెషలిస్టు డైవర్లు అక్కడకు వచ్చినా.. ఫలితం లేకుండాపోయింది.