వారణాశి : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెబాట పట్టడంతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించిన ఒక రోగి తాలూకు బంధువులు జూనియర్ డాక్టర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా నేడు దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేస్తున్నారు. వారణాశిలోని బనారస్ హిందూ హాస్పిటల్లో ఉన్న సుందర్‌లాల్ హాస్పిటల్లో వైద్యుల సమ్మె కారణంగా వైద్యసేవలకు అంతరాయం ఏర్పడటంతో రోగులు వైద్యం అందక ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.