హ‌మ్మ‌య్య‌.... కోడ్ పోయింది

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 10:19 AM
 

మొత్తానికి ఎన్నికల కోడ్‌కు ఎట్టకేలకు  సోమవారంతో తెరపడనుంది..   మూడు నెలలకు పైగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో కొత్తగా చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పరిధిలో ఉండడంతో ఎన్నికల నియమావళికి అనుగుణంగానే విధులను నిర్వర్తించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు  అందించడంతో ఎన్నికల కోడ్‌ పరిసమాప్తమైంది. ఇక 30వ తేదీన జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారంతో కొత్త ప్ర‌భుత్వం పాల‌నా ప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌కు వేదిక కానుంది.