భ‌గ్గుమంటున్న భానుడు... ఉద‌యానికే 47 డిగ్రీలు

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 10:07 AM
 

ఉద‌యం 10గంట‌లు కూడా కాకుండానే భానుడి ఉగ్ర రూపం దాల్చి తెలుగు రాష్ట్రాల మీత త‌న ప్ర‌తాపం చూపండం ఆరంభించాడు. దీంతో ఇరు రాష్ట్రాల‌లోనూ వేడిమి తాళ‌లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.  మే నెల చివరి వారం..పైగా రోహిణి కార్తే రావడంతో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు (రాతి రోళ్లు) బద్దలవుతాయని పెద్దల సామెత. ప్రస్తుతం ఎండలు కాచే విధానం చూస్తుంటే అలాగే ఉంది.  ఆంధ్ర‌ప‌దేశ్‌లో సోమ‌వారం ఉద‌యానికే 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మ‌ధ్యాహ్నానికి ఇవి మ‌రింత పెర‌గ‌టానికి అవకాశముందని రియల్ టైమ్స్ గవర్నెన్స సొసైటీ విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో తులిసింది. తెలిపింది.  ప్రశాకం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం, చిత్తూరు, కృష్ణా, అనంతపురం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశముందని తెలిపింది.  మ‌రోవైపు  రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జగిత్యాల జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సెగలు పుడుతుండడంతో అత్యవసరమయితే తప్ప ప్రజలు రోడ్ల‌పైకి రావ‌ద్ద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.