నెహ్రూకు నివాళులు

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 09:47 AM
 

 దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ తో స‌హా ప‌లువురు రాజ‌కీయ నేత‌లు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.  ట్విట్టర్ వేదికగా ప్ర‌ధాని త‌న నివాళులు అర్పిస్తూ, భ‌ర‌త జాతికి దేశ ప్ర‌ధానిగా, మ‌హోన్న‌త నేత‌గా నెహ్రూ అందించిన సేవలు మరవలేనివంటూ ట్వీట్ చేశారు.  మ‌రోవైపు న్యూఢిల్లీలోని శాంతివనంలో ఉన్న నెహ్రూ ఘాట్ వద్ద నెహ్రూ కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు  పాల్గొన్నారు. అలాగే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్,మమతా బెనర్జీ సహా  పలువురు నాయకులు నెహ్రూ దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.