రేపు గుంటూరు టిడిపి ఆఫీస్‌కు బాబు

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 09:38 AM
 

తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు ఈనెల 28న గుంటూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో   పాల్గొంటారు.అయితే టిడిపి కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం టిడిపి నేతలతో సమావేశమవుతారని టిడిపి వ‌ర్గాలు చెప్పాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ఈ ఏడాది ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై  తెలుగుదేశం పార్టీ చర్చించింది.అయితే ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.ఈ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమనికి చంద్రబాబు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ  వర్గాలు పేర్కొన్నాయి.