స్టార్ హోటళ్లకు మద్యం ప‌రిమితం చేస్తా : జ‌గ‌న్‌

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 12:57 AM
 

 వచ్చే ఏడాదిలోనే విప్లవాత్మక మార్పులు తెస్తానని.. రాష్ట్రంలో అవినీతి అన్నది లేకుండా చేస్తానన్నారు  వైసిపి అధినేత జ‌గ‌న్‌. ఆదివారం ఆయ‌న ఢిల్లీల‌లో మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో  కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించి  చర్యలు తీసుకుంటామన్నారు  మద్యపాన నిషేధం అన్నది ఒక్కసారిగా అమలయ్యేది కాదని దశలవారీగా నిషేధం విధిస్తూ చివరికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి 2024లో మళ్ళీ ప్రజల మద్యకు వచ్చి ఓట్లు అడుగుతామన్నారు.