మితిమీరిన వేగం ఇద్ద‌రిని బ‌లిగొంది

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 10:43 PM
 

నరసరావుపేట మండలం ఇసప్పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.ఆదివారం సాయంత్రం మహేంద్ర కారు అదుపు తప్పి పోలాలలోకి వెళ్ళిన ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులు అక్క‌డిక్క‌డే మృతి చెందిన‌ట్టు పోలీసులు చెప్పారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే రూరల్  సీఐ చిన మల్లయ్య త‌న పోలీసులతో వ‌చ్చి వివరాలు సేకరించారు.  కారులో మొత్తం 5 గురు ప్రయాణం చేస్తున్నార‌ని, మితిమీరిన వేగం కంట్రోల్ చేయ‌లేక ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెప్పారు. కాగా  మృతి చెందిన వారిలో  దేచవరం గ్రామానికి చెందిన ప్రముఖ కేబుల్ ఆపరేటర్ కొండ.వెంకటేశ్వరరెడ్డి కాగా, మరో వ్యక్తి పేరు గోపు శ్రీనివాసరెడ్డి గుళ్లపల్లి గ్రామ వాసిగా గుర్తించారు.. గాయాలు పాలైన ముగ్గురిని స్థానిక గజ్జెల బ్రహ్మరెడ్డి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  కాగా  మృతి చెందిన వారిని పోస్టు మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.