మోడీ ప్ర‌మాణ స్వీకారం 30 రాత్రి 7 గంటలకు

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 10:35 PM
 

వరుసగా రెండో పర్యాయం ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన దరిమిలా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోదీతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ ప్రకటనలో వెల్లడించారు.