కొడుక్కి మోదీపేరు పెట్టుకున్న‌ముస్లిం దంపతులు!

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:44 PM
 

2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లను గెలుచుకొని నరేంద్రమోదీ సంచలనం సృష్టించారు. వరుసగా రెండోసారి పూర్తి స్థాయి మెజార్టీతో ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు. మోదీ ఘన విజయం సాధించడంపై ఓ ముస్లిం దంపతులు తమ కొడుక్కి నరేంద్ర మోదీ అని పేరు పెట్టుకుని హర్షం వ్యక్తం చేశారు.  


ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీనాజ్ బేగం ఈ నెల 23వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు దుబాయ్ ఉంటూ పనులు చేసుకుంటున్న మీనాజ్ భర్త మోదీ గెలిచాడ అని అడిగాడని, తన బిడ్డ కూడా మోదీలా మంచి పనులు చేయాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోదీ అని పేరు పెట్టాలని చెప్పాడని, అందుకే తన బిడ్డకు మోదీ అని పేరు పెట్టినట్లు మీనాజ్ పేర్కొంది. ప్రధాని మోదీ ప్రజల కోసం చేపడుతున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.


 


 


..