జ‌గ‌న్‌తో పాటు మ‌రి 9మంది ప్ర‌మాణం?

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:42 PM
 

ఈనెల 30న న‌వ్యాంధ్ర రెండో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌నె వార్త‌లు వ‌స్తున్నా ఆయ‌న‌తో పాటుమ‌రి  9మంది మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా క‌నిపిస్తోంది. న‌వ‌ర‌త్నాల‌పై తొలిసంత‌కాలు పెట్టాల‌ని అల‌గే 9 మందికి మంత్రులుగా అవకాశం కల్పించాలని ప‌లువ‌రు చేసిన సూచ‌న‌ల‌కు జగన్ ఓకే చెప్పిన‌ట్టు  తెలుస్తోంది. కాగా ఆ తొమ్మది మందిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్రసాదరావు, గ్రంధి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అవంతి శ్రీనివాస్, పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.  త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్ధ‌ల  ఎన్నికల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వారిని ఎంపిక చేసి త‌దుప‌రి కేబినెట్ విస్త‌ర‌ణ‌లో చోటు కల్పించాలని జగన్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.