నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:41 PM
 

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీకి  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ ప్రతినిధి కూడా దృవీకరించారు. భారత్, పాక్ కలిసి పేదరికంపై పోరాటం చేయాలనే అంశం ఇద్దరు నేతలు మాట్లాడిన ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య శాంతి, అభివృద్ధి సాధన కోసం పరస్సర విశ్వాసం నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సిన అవసముందని ప్రధాని మోదీ చెప్పినట్లు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. తీవ్రవాదం, హింసకు తావులేని వాతావరణం దేశాల్లో ఏర్పాడాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నట్లు స్పష్టం చేసింది.