రాయలసీమ జిల్లాల‌పై దృష్టి సారించండి!కన్నా!

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 07:56 PM
 

గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రాయలసీమ జిల్లాలో తీవ్ర నీటికొరత ఏర్పడిందని దీనివల్ల పశువులకు, తీవ్ర దాణ, నీరు కొరత ఏర్పడి కొన్నిచోట్ల పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలకు కరువు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంత రైతులు సకాలంలో వర్షాలు పడక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయశాఖఅధికారులు ,పశుసంవర్ధక శాఖ అధికారులు సమన్వయంతో కరువునుండి కాపాడాలని కోరారు.
రాయలసీమ జిల్లాల కలెక్టర్ లకు ఈ అంశాన్ని పరిశీలనకు కొన్ని సూచనలు:
సబ్సిడీ ధరలతో రైతులకు పశుగ్రాసాన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు అందించాలి..పేద రైతుల కోసం సబ్సిడీ ధర కూడా చెల్లించలేని కోసం ఉచిత గడ్డి కేంద్రాలను రాయలసీమ జిల్లాల్లో కనీసం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి..పశువుల త్రాగునీటి కోసం గతంలో మాదిరిగానే ప్రతి పంచాయితీలోను తాత్కాలిక త్రాగునీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి..ఆయా శాఖ అధికారులతో తక్షణమే నివేదిక తెప్పించుకొని రైతులకు వేసవిలో చెల్లించే వనరుల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు , రైతుల అవగాహన కోసం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.