రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోడీకి వివరించా: జగన్‌

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 02:40 PM
 

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీ భవన్‌లో వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి తగిన సాయం కోరానన్నారు. రాష్ట్రానికి అందాల్సిన సహాయం ఆలస్యమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించానన్నారు. ప్రత్యేక హోదాపై కూడా మోడీతో చర్చించానన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 2.57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని అన్నారు. రాష్ట్రానికి అన్నిరకాల సాయం కావాలని ప్రధానిని కోరామన్నారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారనుకుంటున్నానన్నారు.