అమిత్‌షాను కలిసిన జగన్‌

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 01:25 PM
 

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని అమిత్‌షాను జగన్‌ ఆహ్వానించారు. సుమారు 30 నిమిషాల‌పాటు జ‌గ‌న్‌, అమిత్ షా భేటీ కొన‌సాగింది. తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.