ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన మోదీని అభినందించిన వెంకయ్య

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 12:46 PM
 

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన మోదీకి వెంకయ్య దంపతులు స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన మోదీని వెంకయ్య అభినందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతంపై చర్చించినట్లు వెంకయ్య తెలిపారు.