సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 11:51 AM
 

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం మైదానంలో జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కె.పార్థసారధి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.