ప్రధాని మోడీని కలిసిన జగన్

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 11:50 AM
 

ఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఢిల్లిdలో పర్యటిస్తున్నారు. బేగంపేట నుంచి ఢిల్లిdకి చేరుకున్న జగన్‌ విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోడీతో జగన్‌ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించడం, వారణాసి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని మోడీని జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30న ఏపీ సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్‌ మోడీని ఆహ్వానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మోడీతో జగన్‌ చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనపు నిధులు విడుదల చేయాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.