ప్ర‌మాణ స్వీకారానికి రండి : ప్ర‌ధానికి జ‌గ‌న్ ఆహ్వానం

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 11:22 AM
 

ప్రధానమంత్రి నరేంద్రమోదీని క‌ల‌సిన వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి త‌న ప్ర‌మాణ స్వీకారారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.  ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో అఖండ విజయం అందుకున్నందుకు ప్ర‌ధానికి శుభాకాంక్షలు తెలిపారు.   రాష్ట్రంలోని రాజ‌కీయ పరిస్థితులతో పాటు  కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం ఇలా ప‌లు అంశాల‌పై   జగన్‌ ప్రధానమంత్రి తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  జ‌గ‌న్ వెంట సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి,   మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌లు కూడా ఉన్నారు.