వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 10:37 AM
 

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలదాసిపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైంది.  శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం తలను తొలగించారు. దీంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.  44వ జాతీయ రహదారిపై  వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.