ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 26 నుండి కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 07:42 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 26 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం సాయంత్రం అంకురార్పణం జ‌రిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 29వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూన్ 4 సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. 


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
26-05-2019( ఆదివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం
27-05-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
28-05-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
29-05-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
30-05-2019(గురువారం) మోహినీ అవతారం గరుడ వాహనం
31-05-2019(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం
01-06-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
02-06-2019(ఆదివారం) రథోత్సవం అశ్వవాహనం
03-06-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com