మరో పదిహేనేళ్లు జగనే సిఎంగా ఉండబోతున్నట్టు ధీమా వ్యక్తం చేసారు సినీ నటుడు రాజశేఖర్. శనివారం జీవితతో కలసి మీడియాలో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయగల సత్తా ఉన్న నాయకుడు జగన్ అని, తమతో పాటు ప్రజలు కూడా నమ్మారని, తాము విజయవాడతో సహ ఎపిలోని పలు ప్రాంతాలలో ప్రచారానికి వెళ్లినప్పుడు ఇదే స్పష్టంగా కనిపించిందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మహిళలు వాటిని తీసుకుని, అర్ధరాత్రయినా జగన్ని సిఎం చేయాలన్న కసితో ఓట్లేసారని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ పరంగా ఏపని అప్పగించినా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు జీవితా రాజశేఖర్