కాశ్మీర్ హైవే మూసివేత‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 12:48 PM
 

పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని అధికారులు మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  జ‌మ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో  గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి, అయితే శ‌నివారం తెల్లవారుజామున  భారీగా కొండ‌చెరియ‌లు విరిగిప‌డి రాళ్ల‌తో ర‌హ‌దారి నిండిపోయింది. దీంతో  కశ్మీర్‌ను మిగతా దేశంతో కలిపే ఈ రహదారి మూసుకుపోవడంతో భారీ గా ట్రాఫిక్‌ జాం అయ్యి,  వేల సంఖ్యలో వాహనాలు రహదారి వెంబడి నిలిచిపోయాయి.  సమాచారం.


శిథిలాల తొలగింపుకు సహాయక సిబ్బంది,  ప‌లు యంత్రాల‌తో రంగంలోకి దిగారు. సాధ్యమైనంత తొందరగా రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ రహదారి రాంబన్‌ డీఎస్పీ సురేశ్‌ శర్మ తెలిపారు.