వైసీఎల్పీ నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:52 AM
 

వైసీఎల్పీ నేతగా వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకవాక్య తీర్మానంతో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. జగన్ ను ఎల్పీ నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారు, మరో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాద్ రావు, కొలుసు పార్ధసారధి, ఆదిమూలపు సురేష్.. బొత్స ప్రతిపాదనను బలపరిచారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. మరికాసేపట్లో వైసీపీ లోక్ సభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేతను ఎనుకోనున్నారు. మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కాకినాడ ఎంపీ వంగా గీత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.