సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:27 AM
 

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. భేటీకి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, మల్ల్లికార్జునఖర్గే, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరింద్‌ సింగ్‌, పి. చిదంబరం, సిద్దరామయ్య తదితర నాయకులు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమికి గల కారణాలు, భవిష్యత్‌ కార్యచరణపై నేతలు సమావేశంలో చర్చించనున్నారు.