రేపు గుజరాత్ వెళ్లనున్న మోదీ

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:06 AM
 

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీ.. ఆదివారం గుజరాత్‌కు వెళ్లనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా మోదీ గుజరాత్ వెళ్తున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం గుజరాత్ వెళ్తున్నానని, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటానని మోదీ తెలిపారు. సోమవారం ఉదయం వారణాసి నియోజకవర్గంలో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.