నేను ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే… : శ్రీనివాస్

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:04 AM
 

తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణమని ‘కోడికత్తి’ శ్రీనివాస్ అన్నాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌‌పోర్టులో ‘కోడికత్తి’తో దాడి చేసి జైలుకు వెళ్లిన శ్రీనివాస్ 7 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నారని శ్రీనివాస్ చెప్పాడు. తాను ప్రాణాలతో ఉండడానికి కారణం జగన్ మంచి మనసేనన్నాడు. తాను కావాలని జగన్‌పై దాడి చేయలేదని, యాక్సిడెంటల్‌గా జరిగిందని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్.