ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెం కయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘మొదటిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్కు అభినందనలు. పార్లమెంట్, అసెంబ్లిd ఎన్నికల్లో అద్భుత ఫలి తాలు సాధించినందుకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ము ఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించాలని దక్షిణ భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఈ సందర్భంగా స్టాలిన్ ఆకాంక్షించారు.