శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 10:24 AM
 

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో గోపీచంద్ దంపతులకి వేదపండితులు వేదశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. సెప్టెంబర్ నెలలో రవితేజతో ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని గోపిచంద్ తెలిపారు.