నేడు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 09:11 AM
 

రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది.ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం జిల్లాలతో పాటు చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలకు పైగా నమోదవుతాయి.


 గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి. వడగాల్పులు వీచే సూచనలున్నాయి. ఈ మేర‌కు ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగ నిపుణులు అంచ‌నా వేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఎండల్లో తిరగవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.