స‌మంతా జై కొట్టిన అభ్య‌ర్ధి ఘ‌న‌ విజ‌యం

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 02:15 AM
 

మామ‌గారు జ‌గ‌న్‌కి తోడుగా నిల‌చినా, సినీ ఇండ‌స్ట్రీ అంతా పంకా పార్టీకి జైకొట్టినా నటి సమంత   సైకిల్‌కు ఓటేయాల‌ని ప్రచారం చేసింది. టీడీపీకి ఓటేయాలని ఓటర్లకు విజ్ఞ‌ప్తి చేసింది. అయితే ఈ ప్రచారం నేరుగా నియోజకవర్గానికి వెళ్లి చేయకుండా సోషల్ మీడియా వేదికగా చేసింది.  రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన అనగాని సత్య ప్రసాద్‌‌కు ప్రచారం చేసింది. ఆయన్ను గెలిపించమని కోరుతూ.. సైకిల్ గుర్తుకే మీ ఓటని వీడియో పోస్ట్ చేసింది. సత్య ప్రసాద్‌కు మద్దతుగా నిలవడానికి గల కారణాన్ని కూడా సమంత చెప్పింది. సత్యప్రసాద్ చాలా మంచివాడని.. ఆయన సోదరి తన స్నేహితురాలని తెలిపింది.  స‌మంతా నిర్ణ‌యంపై నెటిజ‌న్లు సెటైర్లు వేసినా ఆమె వెన‌క్కి త‌గ్గ‌లేదు.  రాష్ట్రమంతా ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయినా సమంత సపోర్ట్ చేసిన వ్యక్తి  13వేల మెజార్టీతో ఘన విజయాన్ని అందుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


  అన‌గాని గెలుపుపై స‌మంత కూడా సంతృప్తి వ్య‌క్తం చేసింది. మంచి మ‌నుషులు రాజ‌కీయాల‌లో ఉండాల‌నుకునే వారు అంతా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌ట‌మే అన‌గాని ప్ర‌సాద్ గెలుపు సాధ్య‌మైంద‌న్నారామె.  ప్ర‌సాద్ గెలుపు త‌న‌కు సంతృప్తి క‌లిగించింద‌న్నారు స‌మంతా.