రేపు క‌డ‌ప‌జిల్లాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌?

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 01:48 AM
 

ఆదివాకం కడప జిల్లాలో వైసిపి అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం ఆదివారం ఉద‌యం  వేంపల్లిలోనిఇడుపులపాయకు వెళ్లి తండ్రి దివంగత వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకొని, అక్క‌డ స్వామి ఆశీస్సులందుకుంటారు. ఆపై  పులివెందులలోని సీఎస్ఐ చర్చి లోని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,  క్రైస్త‌వ మ‌త పెద్ద‌ల ఆశీస్సులు అందుకుంటారు. సాయంత్రం కడపలోని పెద్ద దర్గా విచ్చేసి అక్క‌డ ముస్లింల‌తో క‌ల‌సి రంజాన్ వేడుక‌లో పాల్గొన‌టంతో పాటు వారితో రోజాని స్వీక‌రిస్తార‌ని విశ్వసనీయ సమాచారం