మ‌ళ్లీ ఛాన్సిచ్చిన ప్ర‌జ‌ల‌కు థాంక్స్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 01:41 AM
 

పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రెండొ సారీ తాను ప్రాతినిధ్యం వహించడం తనకి గర్వకారణం ఉందని ఎమ్ ఎల్ ఏ వల్లభనేని వంశి అన్నారు. శుక్ర‌వారం రాత్రి త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం లొ తెలుగు దేశం పార్టీ ని గెలిపించినందు నియోజక వర్గ ప్రజలకు   కృతజ్ఞతలు తెలిపారు.  గడిచిన ఐదు సంవత్సరాలు నియోజకవర్గం అభివృద్ధి కై చిత్తశుద్ధి తో పని చేశానని తమ పార్టీ అధికారంలో లేనప్పటికి నియోజకవర్గం అబివృద్ధికై నిరంతరం కృషిచేస్తా నని తెలిపారు. త్వరలో నియోజకవర్గం లోని కబ్జాకి గురైన ప్రభుత్వ భూములని పేదలకు పంచేలా దశల వారీ పోరాటానికి సిద్దమౌతున్నట్లు తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప్రాంతంలో ఉన్నా త‌ను దృష్టి కేంద్రీక‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పారు.