ప్ర‌ధాని కోసం జ‌గ‌న్ ప్ర‌మాణం వాయిదా?

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 01:25 AM
 

ఈ నెల 30 వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ద‌మ‌వుతున్నారు.  అయితే సమయం,స్థలం ఇంకా ఖరారు కానప్పటికీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం,లేదా సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరపాలని వైసిపి శ్రేణులు నిర్ణయించినా,  వివిధ కారణాలతో సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వ‌ద్ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.   ప్రైవేట్ స్థలాల‌లో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం ఏర్పాటు స‌రికాద‌ని   ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో  ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. 


 అయితే త‌న ప్ర‌మాణ స్వీకారంకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు  ప్రదాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని, దీంతో మోడీ  ప్రమాణస్వీకారం కూడా 30న జ‌రిగే ఆస్కారం ఉండ‌టంతో త‌న ప్ర‌మాణ స్వీకారం అవ‌స‌ర‌మైతే వాయిదా వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.  అయితే జగన్ మోహన్ రెడ్డి ప్ర‌ధానిని ఆహ్వానిస్తే హాజరు అయ్యే అంశాన్ని కొట్టి పారేయ‌లేమ‌ని, అధికారులు చెపుతున్నారు.