‘జబర్దస్త్’ నుంచి రోజా, నాగ‌బాబు ఔట్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 01:18 AM
 

ఈటీవీలో ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో పాప్యులర్ కావ‌టానికి అందులో బుల్లి తెర న‌టుల హండామా ఎంతో  న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న  నాగబాబు – రోజా ల సెటైర్లు, చీట్లాట‌లు కూడా అంతే కార‌ణం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వలన ఈ ఇద్దరూ ‘జబర్దస్త్’ కార్యక్రమంకి దూరంగా ఉన్నారు. ఎన్నిక‌లు ముగిసాక  రోజా వచ్చేసి మళ్లీ సందడి చేస్తున్న‌ప్ప‌టికీ మొగా బ్ర‌ద‌ర్‌ నాగబాబు  తిరిగి వ‌చ్చే అంశంపై స్ప‌ష్ట‌త లేదు. కాగా  ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడం .. వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవడంతో పాటు రోజా కూడా న‌గ‌రి నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక కావ‌టం జ‌రిగాయి.  జగన్ ముఖ్యమంత్రి అవుతోన్న నేపథ్యంలో రోజాకి మంత్రి పదవి ద‌క్కుతుంద‌న్న ఊహాగానాల‌కు తెర‌లేచింది.  ఒక‌వేళ రోజా మంత్రి అయితే  ‘జబర్దస్త్’ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి రావ‌చ్చ‌ని వైసిపి వ‌ర్గాలు చెపుతుంటే   ఎంపీ అయినా తను ‘జబర్దస్త్’ వదులుకోనని  ఇప్ప‌టికే నాగబాబు చెప్పినా, తాజా ఎన్నిక‌ల‌లో ఆయ‌న‌ ఓడిపోవడంతో ఇక ‘జబర్దస్త్’ కి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన రాక జ‌రిగేలా లేక‌పోవ‌టం, ప‌లు సినిమాల‌కు సైన్ చేయ‌టం వ‌ల్ల ఖాళీ లేక‌పోవ‌టంతో మ‌ల్లెమాల ప‌రివారం నుంచి అలీ కి ఆహ్వానం అందిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. ఒక‌వేళ అదే నిజ‌మైతే నాగ‌బాబు స్థానంలో ఆలీన‌వ్వులు చూడాలిక‌.