జ‌గ‌న్ విజ‌యంతో... పికే కి పెరిగిన డిమాండ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 01:09 AM
 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సివున్న పార్టీల అధినేతల చూపు ఇప్పుడు ఆయనపైనే ఉంది. ఆయన తమ వెంట నడిస్తే, విజయం సులువవుతుందని భావిస్తున్న నేతలు ఇప్పుడాయన ముందు క్యూ కడుతున్నారు. 2014లో బీజేపీ విజయానికి బాటలు వేయడంతో పాటు, ఆపై బీహార్ లో బీజేపీకి ఎదురు నిలిచి లాలూ, నితీశ్ ల మహాకూటమి ఘనవిజయానికి తనవంతు సాయం చేసిన ప్రశాంత్ కిశోర్, తాజాగా ఏపిలోని ఎన్నిక‌ల బ‌రిలో జగన్ ని సిఎం చేసేందుకు పాద‌యాత్ర మొద‌లు చివ‌రికి పీఠం ఎక్కేఇంచే వ‌ర‌కు  వెన్నంటి నిలిచి, వైసీపీ ఘన విజయానికి కృషి చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడిని అధికారానికి దూరం చేయడంలో పీకే టీమ్ పాత్ర కూడా చాలానే ఉందనడంలో సందేహం లేదు.   గత వారంలో ప్రశాంత్ కిశోర్ తండ్రి మరణించడంతో ఆయన కొంత దిగులుగా ఉన్నారని, కోలుకున్న తరువాత తదుపరి ప్రణాళికల గురించి ఆయనే నిర్ణయిస్తారని ఆత‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.