రౌడీయిజం చేయాల‌నుకుంటే తాట తీసేయండి

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 12:26 AM
 

ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు  సీఎస్‌, డీజీపీలు కూడా  కలసి శుభాకాంక్షలు అందజేశారు. ఆ సమయంలో కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు.. తన పాలన తీరుతెన్నులను వారికి రేఖామాత్రంగా వివరించారని స‌మాచారం.   ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్‌ గారితో మాట్లాడుతూ..  రాయలసీమ 4 జిల్లాలకు స్ట్రిక్ట్, డైనమిక్‌, యంగ్‌, ఎనర్జిటిక్‌ ఐపీఎస్‌లను రెడీ చేయమని   ఇకపై రాయలసీమలో అసాంఘిక క‌లాపాలు  జరగకుండా చూడాల‌ని ఆదేశాలిచ్చారని తెలుస్తోంది. 24 గంటల్లో.. అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ల జాబితా నాకు కావాలి.. అలాంటి వారు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే.. డిప్యుటేషన్ పై రప్పించే అవకాశాలున్నా పరిశీలించండి అని జగన్ గౌతం సవాంగ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది.


అలాగే చీఫ్ సెక్రటరీ తో  ప్రతి జిల్లా కలక్టర్ పారదర్శకంగా, స్ట్రిక్టుగా ఉండాని చెప్పారట. శాంతి భద్రత విషయంలో ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే తోలు తీసేయండి అంటూ జగన్‌ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఇక జగన్ మార్కు పాలన ప్రారంభమైనట్టేనని అధికార వ‌ర్గాల‌లో వినిపిస్తున్న మాట‌.