మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 12:19 AM
 

కనీవినీ ఎరగుని ప్రభంజనంతో విపక్షాలను చిత్తుచేసి ఎన్డీయే కూటమికి అఖండ విజయం సాధించిపెట్టిన నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన పంపిన రాజీనామా లేఖకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అయితే, కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరేంత వరకు మోదీ, ఇతర మంత్రివర్గ సభ్యులు పదవుల్లో కొనసాగాలని కోరారు. అంతకుముందు, ప్రధాని మోదీతో పాటు క్యాబినెట్ సహచరులు కూడా తమ రాజీనామా లేఖలను రాష్ట్రపతికి అందించారు. ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ వాటిని లాంఛనంగా ఆమోదించారు. కాగా, ఈ రాత్రికి రాష్ట్రపతి కేంద్ర మంత్రులకు విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత బీజేపీ పార్లమెంటరీ నేతను ఎన్నుకుంటారు.