మోడీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ !

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 08:40 PM
 

మోడీ సారథ్యంలో నడిచిన ఎన్డీయేకు మొదటి నుండి బాలీవుడ్ సెలబ్రిటీల నుండి భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా జరిగిన ఫలితాలు లెక్కింపులో భాజాపా 303 స్థానాలను దక్కించుకుంది.  దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తాజాగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా మోడీని అభినందించారు. దేశ ప్రజలందరం కలిసి సరైన ప్రభ్యుత్వాన్ని ఎన్నుకున్నాం.  ఇకపై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన కలల్ని, ఆశల్ని నెరవేర్చుకోవాలి.  ప్రజాస్వామ్యం గెలిచింది.  మోడీకి, భాజాపా లీడర్లకు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.