రవి ప్రకాష్‌కు NCLTలో చుక్కెదురు!

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 08:16 PM
 

మరోసారి Tv9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు NCLTలో చుక్కెదురైంది. ABCLపై సైఫ్ మారిషస్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను NCLT కొట్టివేసింది. సైఫ్ మారిషస్ పిటిషన్‌లో సినీ నటుడు శివాజీ ఇంప్లీడ్ అయ్యారు. Tv9లో తనకు కూడా షేర్లు ఉన్నాయని..యాజమాన్య మార్పిడి చేయొద్దంటూ NCLTలో శివాజీ పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ మారిషస్ - ఐ విజన్ సంస్థల మధ్య కోర్టు బయట ఒప్పందం కుదిరింది. ఒప్పందాన్ని అంగీకరిస్తూ ఉన్న పిటిషన్‌ను మే 24వ తేదీ శుక్రవారం NCLT కొట్టివేసింది. విచారణ సందర్భంగా కొత్త మీడియా (అలంద) ఢిల్లీలో ఉన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌లో వాస్తవం లేదని పేర్కొంది. NCLT పిటిషన్లు కొట్టివేయడంతో తెలంగాణ పోలీసులు రంగంలో దిగారు. తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, సినీ నటుడు శివాజీలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ9 వ్యవహరంలో పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మే21వ తేదీన 41 (ఏ) సీఆర్పీసీ కింద సైబర్ క్రైం పోలీసులు నోటీసులు పంపారు. మే 23న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే..ఈ నోటీసులకు స్పందించలేదు రవి ప్రకాష్.