గవర్నర్ ను క‌ల‌వ‌నున్న సిఎస్ ద్వివేది!

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 07:34 PM
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరారు. ఎలక్షన్ ప్రొఫార్మాలో ఎమ్మెల్యేల వివరాలను ఆయన గవర్నర్ కు అందచేయనున్నారు. ఈనెల 26న ఉదయం 11.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ద్వివేది వివరాలు అందచేసిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవల్సిందిగా గవర్నర్ వైసీపీ అధినేత జగన్ ను కోరనున్నారు.