సిద్ధి వినాయకుని సేవలో దేవేంద్ర ఫడ్నవిస్

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 07:05 PM
 

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 41 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాల్లో గెలుచుకున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 5 స్థానాలకు పరిమితంకాగా...ఇతరులు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు.మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిజ్ శక్రవారం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు.సిద్ధి వినాయక ఆలయాన్ని దేవేంద్ర ఫడ్నవిజ్ దర్శించుకున్న సమయంలో బీజేపీకి చెందిన పలువురు నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.సిద్ధి వినాయక ఆలయ అధికారులు ముఖ్యమంత్రి ఫడ్నవిజ్‌‌కు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.