మంగళగిరిలో జనసేన కీలక సమావేశం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 07:02 PM
 

  గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణపై కీలకంగా చర్చించారు. తమ పరిశీలనకు వచ్చిన వివిధ అంశాలను నేతలు పవన్‌కు వివరించారు. వచ్చే నెల నుంచి మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.