లగడపాటి ఎన్నికల సర్వే సన్యాసం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 06:00 PM
 

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం తీవ్ర పోరాటం చేసి ఆఖరికి రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోవడంతో లగడపాటి అప్పటి నుండి రాజకీయాలలో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలలో సర్వేలు తారుమారవగా నిన్న ఏపీ ఫలితాలలో కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే సమయంలోనే ఏపీలో ఫలితాలు తారుమారైతే సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటకి కట్టుబడే సర్వే సన్యాసం చేస్తున్నట్లుగా ప్రకటించారు. గెలిచిన జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన లగడపాటి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని ఇకపై రాజకీయ సర్వేలకు దూరంగా ఉంటానన్నారు.