మోదీకి ఇవాంక ట్రంప్ శుభాకాంక్షలు

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 05:52 PM
 

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారతదేశ ప్రజలు మోదీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని ఆమె పేర్కొన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు.